Share News

నేడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పాలమూరు ప్రాజెక్టు సందర్శన

ABN , Publish Date - Mar 01 , 2024 | 03:59 AM

ఓవైపు బీఆర్‌ఎస్‌ నేతలు మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్న క్రమంలో.. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం

నేడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పాలమూరు ప్రాజెక్టు సందర్శన

రేవంత్‌ మినహా పర్యటనకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

ప్రాజెక్టు పనులు, వాటి నాణ్యత పరిశీలన

బీఆర్‌ఎస్‌ ‘చలో మేడిగడ్డ’కు కౌంటర్‌గా..

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 29: ఓవైపు బీఆర్‌ఎస్‌ నేతలు మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్న క్రమంలో.. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐ) సందర్శించబోతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేల్లో సీఎం రేవంత్‌రెడ్డి మినహా మిగతా 11 మంది పాలమూరు ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కర్వెన, ఉదండాపూర్‌ రిజర్వాయర్లను శుక్రవారం సందర్శించనున్నారు. అక్కడ జరిగిన పనులు, వాటి నాణ్యతను పరిశీలించనున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.. పాలమూరు-రంగారెడ్డి పథకంలోనూ కమీషన్ల కోసం ఇష్టానుసారంగా అంచనాలు పెంచి డిజైన్‌ మార్చారని ఆ పార్టీ నేతలు ఎప్పట్నుంచో ఆరోపణలు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌ చేపట్టిన ‘చలో మేడిగడ్డ’కు కౌంటర్‌గా.. పాలమూరు ప్రాజెక్టును సందర్శించి అక్కడి లోపాలను ఎత్తిచూపేందుకు ఆ పార్టీ సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది.

Updated Date - Mar 01 , 2024 | 10:38 AM