Share News

మాదిగలకు కాంగ్రెస్‌ అన్యాయం చేస్తోంది

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:46 AM

మాదిగలకు కాంగ్రెస్‌ అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

మాదిగలకు కాంగ్రెస్‌ అన్యాయం చేస్తోంది
మాట్లాడుతున్న మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు

భువనగిరి రూరల్‌, ఏప్రిల్‌ 17: మాదిగలకు కాంగ్రెస్‌ అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. ‘మా జాతి హక్కులు మాకు కల్పించడం లేదు’ అని మంద కృష్ణ మాదిగ మాట్లాడిన దాంట్లో తప్పు లేదన్నారు. కడియం శ్రీహరిది ఏ కులమో ఆయనకే తెలియదన్నారు. మాదిగలకు జనాభా ప్రాతిపదికన పార్లమెంట్‌ టికెట్లు కేటాయిం చాలని కాంగ్రెస్‌ అదిష్ఠానానికి విజ్ఞప్తి చేశామన్నారు. తెలంగాణలో దాదాపు 80లక్షల మంది మాదిగల జనాభా ఉన్నప్పటికీ ఆ జనాభాకంటే తక్కువ శాతం ఉన్న ఇతర కేటగిరీ కులస్థులకు ఒక్క ఇంటిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆ కుటుంబంలోనే మరో వ్యక్తికి ఎంపీ టికెట్‌ కేటాయించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరు ద్ధమన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబే ద్కర్‌ కల్పించిన హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి మాదిగ లమనే తమ కులస్థులకు ఇప్పటివరకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికీ కాంగ్రెస్‌ పార్టీ నుంచి మారే ఉద్దేశం లేదని, మాదిగలకు జరుగుతున్న అన్యాయం, హక్కుల సాధనకు గురువారం బేగంపేటలోని లీలానగర్‌లో తన ఇంటి వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఈ దీక్షకు మేధావి వర్గం ప్రజాస్వామ్య వాదులు, ప్రజా సంఘాలు, ఎమ్మార్పీఎస్‌ నేతలు పెద్ద సంఖ్యలో హాజరై సంఘీభావం తెలపాలని కోరారు.

Updated Date - Apr 18 , 2024 | 12:46 AM