Share News

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం

ABN , Publish Date - May 08 , 2024 | 12:13 AM

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నా రు.

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం
గట్టుప్పలలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

గట్టుప్పల్‌, మే 7: కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నా రు. మండలకేంద్రంలో మంగళవారం జరిగిన భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికల పార్టీ కమిటీల ఇన్‌చార్జిలు, బూత్‌ కమిటీ సభ్యుల సమా వేశంలో మాట్లాడుతూ భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండు ఒకటేనని రాష్ట్రంలో ఉన్న ప్రజలను అన్ని రకాలుగా దోచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తేనే పేద వర్గాల ప్రజల అభ్యున్నతి జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్‌నేత, నాయకులు నామ జగన్నాథం, చిరుపల్లి సత్యనారాయణ, రావుల రమేష్‌, ఆంజనేయులు, రాములు, శ్రీరాములు పాల్గొన్నారు.

మర్రిగూడ: ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షి తులై వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చేరుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో మంగళవారం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతారన్నారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో అజలాపురం మాజీ సర్పంచ్‌ లాలునాయక్‌, వార్డు మెంబర్లు, అదేవిధంగా బీఆర్‌ఎస్‌ నుంచి 50మంది కార్యకర్తలు చేరారు. ఈ కార్యక్రమంలో ముద్దం శ్రీనివాస్‌, రాందాసు శ్రీనివాస్‌, అజలాపురం మాజీ సర్పంచ్‌ డి.అంజయ్య, మాజీ జడ్పీటీసీ మేతరి యాదయ్య, ఉప్పునూతల మల్లేష్‌, జంగయ్య, వెంకటయ్య, అజిత్‌రెడ్డి, అనిల్‌రెడ్డి ఉన్నారు.

హాలియా: హాలియా మునిసిపల్‌ చైర్మన్‌ యడవల్లి అనుపమ నరేందర్‌రెడ్డి అధ్వర్యంలో అలీనగర్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మహ్మద్‌ అజంద్‌ఖాన్‌, అక్బర్‌ ఖాన్‌, జావిద్‌ఖాన్‌, ఇమ్రాన్‌ఖాన్‌, ఇమ్రాన్‌ఖాన్‌, అక్రమ్‌ఖాన్‌, జియాకాన్‌, హర్షఖాన్‌, మక్సూద్‌అలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 12:14 AM