Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి భవిష్యత్తు లేదు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:14 PM

కాంగ్రెస్‌ ప్ర భుత్వానికి భవిష్యత్తు లేదు, మా ప్రభుత్వం చిన్న చిన్న పొరపాట్ల వల్ల అధికా రం కోల్పోయిందని ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి భవిష్యత్తు లేదు
రిటర్నింగ్‌ అధికారి జీ రవినాయక్‌కు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేస్తున్న ఎంపీ మన్నెం శ్రీనివాస్‌ రెడ్డి

- చిన్నచిన్న పొరపాట్ల వల్ల మా ప్రభుత్వం పోయింది

- ప్రజలు తిరిగి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నారు : ఎంపీ మన్నె

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌)/ మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 25 : కాంగ్రెస్‌ ప్ర భుత్వానికి భవిష్యత్తు లేదు, మా ప్రభుత్వం చిన్న చిన్న పొరపాట్ల వల్ల అధికా రం కోల్పోయిందని ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గురువారం బీఆర్‌ఎస్‌ మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా ఆయన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజ య్యయాదవ్‌ తదితరులతో కలిసి మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నిం గ్‌ అధికారి, కలెక్టర్‌ జీ రవినాయక్‌కు సమర్పించారు. అనంతరం ఆయన మీడి యాతో మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ 2019లో నాకు ఎంపీ టికెట్‌ ఇచ్చాడు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ రోజు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోయింద న్నారు. తెలంగాణ ప్రజలు తిరిగి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నారని, రాష్ట్రం లో 10 ఎంపీ సీట్లను గెలువబోతున్నట్లు తెలిపారు. అంతకు ముందు నా అను చరులైన టీ శ్రీధర్‌రెడ్డి ద్వారా ఈ నెల 19న 1 సెట్‌ నామినేషన్‌ పత్రాలను సమర్పించినట్లు తెలిపారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు 24 గంటల కరెంట్‌, సకాలంలో రైతు బంధు, తదితర పథకాలు అందించామన్నారు. కాంగ్రె స్‌ పాలన రాగానే కరెంట్‌ పోయింది, రైతులు ఏసుకున్న పంటలు ఎండిపో యాయి, రుణమాఫీ లేదు, పరిశ్రమలు మూత పడుతున్నాయని ఆరోపించారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటై అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి పని చేశాయన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, వాల్యానాయక్‌, యాదయ్య, రాజేశ్వర్‌గౌడ్‌, కొరమోని నరసింహులు, కోరమోని వెంకటయ్య, అబ్దుల్‌ రహమాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:14 PM