Share News

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమన్వయకర్తలు

ABN , Publish Date - Jan 08 , 2024 | 05:05 AM

వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కారగ్రెస్‌ దూకుడుపెంచింది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను ఏఐసీసీ నియమించింది.

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమన్వయకర్తలు

17 నియోజకవర్గాలకు కోఆర్డినేటర్ల నియామకం

హైదరాబాద్‌, జనవరి 7(ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కారగ్రెస్‌ దూకుడుపెంచింది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలోని 15 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలుగా రాష్ట్ర మంత్రులను నియమించారు. నిజామాబాద్‌ పార్లమెంటు బాధ్యతలను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ఇవ్వగా జహీరాబాద్‌ కోఆర్డినేటర్‌గా మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిని నియమించారు. వాస్తవానికి ఇటీవల జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏపీ)సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు మంత్రులకు నియోజకవర్గాల వారీగా సమన్వయం చేసుకునే బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు నిర్ణయాన్ని అధిష్ఠానానికి పంపారు. దానికి ఆమోదముద్ర వేసిన అధిష్ఠానం.. పీఏపీ ప్రతిపాదన మేరకు మంత్రులను సమన్వయ కర్తలుగా నియమించింది.

నియోజకవర్గాల వారీగా సమన్వయ బాధ్యతలు

సీఎం రేవంత్‌రెడ్డి(మహబూబ్‌నగర్‌, చేవెళ్ల), డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క(హైదరాబాద్‌, సికింద్రాబాద్‌), పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి(ఖమ్మం, మహబూబాబాద్‌), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(నల్లగొండ), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(భువనగిరి), దామోదర్‌ రాజనర్సింహ(మెదక్‌), పొన్నం ప్రభాకర్‌(కరీంనగర్‌), శ్రీధర్‌బాబు(పెద్దపల్లి), తుమ్మల నాగేశ్వర్‌రావు(మల్కాజ్‌గిరి), జూపల్లి కృష్ణారావు(నాగర్‌కర్నూల్‌), సీతక్క(ఆదిలాబాద్‌), కొండా సురేఖ(వరంగల్‌), ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి(నిజామాబాద్‌), మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి(జహీరాబాద్‌).

Updated Date - Jan 08 , 2024 | 06:37 AM