Share News

Kumaram Bheem Asifabad- కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:03 PM

పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా ఎంపీ అభ్యర్థి గెడెం నగేష్‌ తరపున మండలంలోని చిర్రకుంట, చుచ్చుపల్లి, హీరాపూర్‌, భూపాలపట్నం, కేశవపట్నం గ్రామాల్లో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Kumaram Bheem Asifabad-    కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

సిర్పూర్‌(టి), ఏప్రిల్‌ 30: పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా ఎంపీ అభ్యర్థి గెడెం నగేష్‌ తరపున మండలంలోని చిర్రకుంట, చుచ్చుపల్లి, హీరాపూర్‌, భూపాలపట్నం, కేశవపట్నం గ్రామాల్లో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటేనని కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని అన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాని మోదీ పాలనలోనే అభివృద్ధి జరిగిందని చెప్పారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మకుండా బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేష్‌కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని కోరారు. ఆయన వెంట నాయకులు శంకర్‌, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

బీజేపీ నాయకుల ప్రచారం

కాగజ్‌నగర్‌, ఏప్రిల్‌ 30: కాగజ్‌నగర్‌ మండలం నజ్రూల్‌నగర్‌ క్యాంపుల్లో మంగళవారం బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ మాట్లాడుతూ పేదల కోసం ప్రధాని మోదీ పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు కాలిదాస్‌, అమిత్‌ బిశ్వాస్‌, రాకేష్‌, ఆశుతోష్‌, గోవింద్‌, తదితరులు పాల్గొన్నారు.

పెంచికలపేట: మండలంలోని ఆగర్‌గూడ గ్రామంలో బీజేపీ నాయకులు మంగళవారం గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీని మరో సారి ప్రధానిగా చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రాజన్న,నగేష్‌, సత్తన్న, శంకరయ్య, కిషన్‌, శ్రీనివాస్‌, అనంతరావు, గంగాధర్‌, మధుకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 11:03 PM