Share News

రాజీపడదగిన కేసులను గుర్తించాలి

ABN , Publish Date - Feb 17 , 2024 | 11:43 PM

పోలీస్‌ స్టేషన్ల వారీగా రాజీపడదగిన కేసులను గుర్తించాలని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ జడ్జి యం.సధ్యారాణి సూచించారు.

రాజీపడదగిన కేసులను గుర్తించాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.సధ్యారాణి

- వచ్చే నెల 9న జాతీయ లోక్‌ అదాలత్‌

- జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి,

సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.సధ్యారాణి

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 17 : పోలీస్‌ స్టేషన్ల వారీగా రాజీపడదగిన కేసులను గుర్తించాలని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ జడ్జి యం.సధ్యారాణి సూచించారు. శనివారం రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ ప్రిన్సిపాల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యాలయంలో పోలీసు అధికారులు, కోర్టు కానిస్టేబుల్స్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ వచ్చేనెల మార్చి 9వ తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో రాజీపడదగిన కేసులను అన్నింటిని రాజీ మార్గంలో పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులు, డ్రంక్‌అండ్‌డ్రైవ్‌ కేసులు, ఈ పిటి కేసులు, డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ కేసులు, ట్రాఫిక్‌ చలాన్‌ కేసులు పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ వారీగా కేసుల వివరాలను గుర్తించి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జాతీయ లోక్‌అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ మొత్తం కేసులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసు అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 11:43 PM