సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:49 AM
సమగ్ర శిక్షలో దీర్ఘకాలి కంగా పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెం కట్‌రెడ్డి అన్నారు.

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సమగ్ర శిక్షలో దీర్ఘకాలి కంగా పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెం కట్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పర్యటన అనంతరం కలెక్టరేట్‌కు వచ్చిన సందర్భంగా మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశా రు. ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలపై ఆలోచించి ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్తానని అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తాము దీర్ఘకాలికంగా సమగ్ర శిక్షలో ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్నామని, తమకు వేతనాలు పెంచడంతో పాటు రెగ్యులరైజ్ చేయాలని, బీ మా, ఇతర బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. ఈ మేరకు మంత్రి ఉ ద్యోగుల సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రి పాఠి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ము నిసిపల్ చైర్మన బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.