ముగిసిన కబడ్డీ పోటీలు
ABN , Publish Date - May 26 , 2024 | 11:46 PM
గద్వాల జిల్లా ఉండల్లి మండలం తక్కశిల గ్రామంలో ఉమారామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలు రెండు రోజుల పాటు హోరాహోరీగా సాగాయి.
ఉండవల్లి, మే 26: గద్వాల జిల్లా ఉండల్లి మండలం తక్కశిల గ్రామంలో ఉమారామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలు రెండు రోజుల పాటు హోరాహోరీగా సాగాయి. ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. శనివారం రాత్రి జరిగిన ముగింపు పోటీల్లో భీంపురం జట్టు మొదటి విజేతగా నిలవగా దాత మల్లికార్జున్ యాదవ్ రూ.30వేల నగదును అందజేశారు. మూలమల్లకు చెందిన జట్టు ద్వితీయ విజేతగా నిలవగా దాత ఆర్. ఈదన్న రూ.20వేలను, గద్వాల జట్టు మూడవ విజేతగా నిలిచి దాత స్వాములు రూ.15వేలను, గోనెగండ్ల జట్టు నాల్గవ విజేతగా కమతం వెంకట్రాముడు రూ.10వేలను, మంత్రాలయం జట్టు ఐదవ స్థానంలో నిలవగా టి. వెంకట్రాముడు రూ. ఐదువేలను అందజేశారు. కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి, మధురెడ్డి, రాజేష్, రామకృష్ణ, చంద్రశేఖర్ నాయుడు, ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
- క్రికెట్ విజేత షఖీల్-11జట్టు
మండల కేంద్రంలో ఈదమ్మ దేవరను పురస్కరించుకుని క్రికెట్ యూత్ ఆధ్వర్యంలో ఈనెల 16నుంచి 10రోజుల పాటు జరిగిన క్రికెట్ పోటీలు కొనసాగాయి. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఉండవల్లికి చెందిన షకీల్-11జట్టు మొదటి విజేతగా నిలవగా దాత సివిల్ ఇంజనీర్ వెంకటేష్ గౌడ్ రూ.50వేలను అందజేశారు. రెండవ విజేత రిషి జట్టుకు దాత రాంకోటి రెడ్డి రూ.30వేలను, కర్నూలు జట్టుకు దాత అలంపూర్ చౌరస్తా దయాకర్ ట్రేడర్స్ వారు రూ.15వేలను అందజేశారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బహుమతులను క్రిష్ణవేణి హై స్కూల్ వారు అందజేయగా, బెస్ట్ మ్యాన్, బెస్ట్ బౌలర్‌లకు పిడుగు వెంకటేష్‌లు అందజేశారు. కార్యక్రమంలో క్రికెట్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.