Share News

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 30 , 2024 | 11:34 PM

ప్రజావా ణిలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను సత్వరమే పరి ష్కరించాలని కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- ప్రజావాణిలో కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ప్రజావా ణిలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను సత్వరమే పరి ష్కరించాలని కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 26ఫిర్యాదులు వ చ్చినట్లు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదుల ను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమ స్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ కే.సీతారామారావుకు విన్నవిస్తూ అర్జీలు సమ ర్పించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్కరించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

ఫ చారకొండ : ప్రజల సమస్యల పరిష్కా రానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న ట్లు తహసీల్దార్‌ సునీత అన్నారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్ర జావాణి కార్యక్రమానికి వివిధ శాఖల అధికా రులు హాజరయ్యారు. అంతకముందు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు రెండు నిమి షాలు అధికారులు మౌనం పాటించారు. కార్య క్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ విద్యాధరిరెడ్డి, వీఎల్‌వో షేక్‌ మదార్‌, హెచ్‌ఈవో నారాయణ దాస్‌చారి తదితరులు పాల్గొన్నారు.

సత్వరమే పరిష్కరించాలి : ఎస్పీ

నాగర్‌కర్నూల్‌ క్రైం : పోలీస్‌ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలు సత్వరమే పరిష్క రించాలని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ సంబంధిత పోలీస్‌ అధికారులను ఆదేశిం చారు. సోమవారం నిర్వహించిన ప్రజావా ణిలో తగు న్యాయం గురించి 3, భూమి పంచాయతీలు 4 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు.

Updated Date - Dec 30 , 2024 | 11:34 PM