Share News

సైబర్‌ నేరాలపై ఫిర్యాదు ఇక సులభం

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:42 AM

సైబర్‌ నేరం జరిగిన వెంటనే బాధితులు 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేస్తే త్వరగా స్పందించి పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేసేఅవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సైబర్‌ నేరాలు

సైబర్‌ నేరాలపై ఫిర్యాదు ఇక సులభం

సైబర్‌ యోధులకు ప్రత్యేక సెల్‌ఫోన్లు

1930కు వచ్చిన కాల్స్‌ వెంటనే బదిలీ

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరం జరిగిన వెంటనే బాధితులు 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేస్తే త్వరగా స్పందించి పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేసేఅవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సైబర్‌ నేరాలు పెరిగిపోవడంతో 1930కు కూడా కాల్స్‌ పెరిగిపోయాయి. బాధితులు 1930కు ఫోన్‌ చేసినప్పుడు లైన్‌ బిజీ అని వస్తుంది. ఇకపై ఈ కష్టాలు ఉండవని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న సైబర్‌ యోధులకు(సైబర్‌ క్రైమ్‌ కానిస్టేబుల్‌) ప్రత్యేక మొబైల్స్‌ అందజేయాలని నిర్ణయించారు. సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి, సైబర్‌ క్రైమ్‌ డీసీపీ నర్సింహ, సైబర్‌ క్రైమ్‌ సిబ్బంది, సైబర్‌ యోధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బాధితులు 1930కు కాల్‌ చేయగానే వారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలుసుకొని ఆ కాల్‌ను సమీపంలో ఉన్న సైబర్‌ యోధులకు బదిలీ చేస్తారన్నారు. వారు ఆ కాల్‌ రిసీవ్‌ చేసుకొని బాధితులు చెప్పిన వివరాలు తీసుకొని ఫిర్యాదును రిజిస్టర్‌ చేసుకోవాలి. వెంటనే నేషనల్‌ సైబర్‌ పోర్టల్‌లో రిపోర్టు పెట్టాలి. దాంతో ఏ బ్యాంకు ఖాతాలో పోయిన డబ్బు జమ చేశారో గుర్తించి ఫ్రీజ్‌ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇలా కాల్స్‌ను బదిలీ చేయడం వల్ల 1930 లైన్‌సులభంగా కలిసే అవకాశం ఉంటుందన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 08:30 AM