Share News

ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:22 AM

ఎండిపోతున్న వరి పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి
చౌటుప్పల్‌లో ధర్నా నిర్వహిస్తున్న రైతు సంఘం నాయకులు

చౌటుప్పల్‌ టౌన్‌, మార్చి 11: ఎండిపోతున్న వరి పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలోని చౌటుప్పల్‌ ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. వరి పంటను రక్షించుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నా రన్నారు. కార్యక్రమంలో నాయకులు చీరిక సంజీవరెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, పాషా, గంగదేవి సైదులు, చీరిక అలివేలు, రాఘవరెడ్డి, సప్పిడి లక్ష్మారెడ్డి, ఆకుల ధర్మయ్య, కొండే శ్రీశైలం పాల్గొన్నారు.

వలిగొండ: పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదు కోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మద్దెల రాజయ్య డిమాండ్‌ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. నష్టపోయిన వరి పంటకు ఎకరాకు రూ.30వేలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ముత్యాలు సురేందర్‌, శ్రీశైలంరెడ్డి, రాంచందర్‌, భూపాల్‌, సత్తిరెడ్డి, ఆంజనే యులు, వెంకట్‌రెడ్డి, కిష్టయ్య, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట రూరల్‌ : పంటలు ఎండి తీవ్ర నష్టపోతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మంగ నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బబ్బూరి పోశెట్టి, నూకల భాస్కర్‌రెడ్డి, జోగు శ్రీనివాస్‌, బండ్రెడ్డి ఈశ్వర్‌రెడ్డి, పి.ఎస్‌. లింగం, నూకల అరుణ, దుడుక నాగమణి పాల్గొన్నారు.

భువనగిరి టౌన్‌ : ఏడాది కిత్రం ఆందోళన విరమణ కోసం కేంద్రం రైతులకు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవే ర్చాలని బీఎస్పీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బట్టు రామచంద్రయ్య అన్నారు. సోమవారం భువనగిరిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్యారానికి కేంద్ర ప్రభుత్వంపై 425 రైతు సంఘాల ఆందోళనకు మద్ధతు ఇస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో నాయకులు కాయగూర రామకృష్ణ, రాపోలు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

మోత్కూరు: బావులు, బోర్లలో నీటి మట్టాలు తగ్గి ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్‌ చేశారు. మండలంలోని పాలడుగు గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో ఎండిన వరి పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో మండల కమిటి సభ్యులు దడిపెల్లి ప్ర భాకర్‌, కొంపెల్లి ముత్తమ్మ, చింతకింది సోమరాజు, వడ్డెపల్లి లక్ష్మణ్‌, కొంపెల్లి గంగయ్య, రైతులు దడిపల్లి నవనీత, సైదులు పాల్గొన్నారు.

భువనగిరి రూరల్‌: కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించి ఎండుతున్న వరి పంటలను కాపాడాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ డిమాండ్‌చేశారు. మం డలంలోని హన్మపురంలో ఎండిపోతున్న పొలాలను పరిశీలించారు. భూగర్భజలాలు అడుగంటి పోవడంతో రైతులు సాగు చేసుకుంటున్న చేతికొచ్చిన పోట్టదశకు చేరిన పంటలు ఎండిపోతున్నప్పటీకీ అధి కారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.

Updated Date - Mar 12 , 2024 | 12:22 AM