కంపెనీలకు చెరువుల ధారాదత్తంపై సమీక్షించాలి
ABN , Publish Date - Sep 11 , 2024 | 04:57 AM
బీఆర్‌ఎస్ హయాంలో చెరువుల సుందరీకరణ పేరిట బడా కంపెనీలకు జరిగిన కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించాలని బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. కార్పొరేట్ సామాజిక
బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్
హైదరాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ హయాంలో చెరువుల సుందరీకరణ పేరిట బడా కంపెనీలకు జరిగిన కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించాలని బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద చెరువుల సుందరీకరణ అంటూ 2022లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లోని 25 చెరువులను పలు సంస్థలకు అప్పజెప్పిందని శంకర్ తెలిపారు. సదరు కంపెనీలు ఆయా చెరువులను ఆక్రమించి ఎఫ్‌టీఎల్ పరిధిలోకి చొచ్చుకొచ్చాయని, కొన్ని సంస్థలు బఫర్‌జోన్ వదలకుండా రూ.వందల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టాయని ఆరోపించారు. సల్కం చెరువులో ఎంఐఎంకి సంబంధించిన ఫాతిమా కాలేజీ నిర్మాణం అక్రమంగా చేపడితే ఎందుకు కూల్చడం లేదని హైడ్రా పేరుతో హడావుడి చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం పేదలు, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.