Manchiryāla- నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం
ABN , Publish Date - Jun 12 , 2024 | 10:21 PM
నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో శ్రీరాంపూర్ సీఐ మోహన్, భీమారం ఎస్‌ఐ రాములుతో కలిసి కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సోదాలు చేసి 17 లీటర్ల గుడుంబా, 1200 లీటర్ల బెల్లం పానకంను ధ్వంసం చేశారు.

భీమారం, జూన్ 12: నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో శ్రీరాంపూర్ సీఐ మోహన్, భీమారం ఎస్‌ఐ రాములుతో కలిసి కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సోదాలు చేసి 17 లీటర్ల గుడుంబా, 1200 లీటర్ల బెల్లం పానకంను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజల రక్షణే పోలీసు బాధ్యత అని తెలిపారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు, నేరస్తులు షెల్టర్ తీసుకుంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, బాగా చదువుకోవాలని సూచించారు. ఏదైనా సమస్యలుంటే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలని, వాహనాలకు సంబంధించిన అన్నిధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇతరులకు బ్యాంకు ఖాతా, ఏటీఎం పిన్, ఓటీపీ నెంబర్లు చెప్పవ ద్దన్నారు. గ్రామాల్లో స్వీయరక్షణ కోసం సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచిం చారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నాగరాజు, ఏఏస్‌ఐలు శకుంతల, సంపూర్ణ, మాచర్ల, ముత్తయ్య, మహేష్‌బాబు, సంతోష్, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.