Share News

Manchiryāla- పాదయాత్రకు తరలిరావాలి

ABN , Publish Date - Mar 11 , 2024 | 09:53 PM

జోడువాగుల దగ్దర బ్రిడ్జి నిర్మాణంతో పాటు రోడ్డు నిర్మించాలనే డిమాండ్‌తో మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రకు అన్ని ప్రజా సంఘాల నాయకులు తరలిరావాలని సీఐటీయూ, ఇతర సంఘాల నాయకులు కావిరి రవి, రాతిపల్లి నగేష్‌ కోరారు. మండల కేంద్రంలో సోమవారం ప్రజా సంఘాల నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Manchiryāla-      పాదయాత్రకు తరలిరావాలి
మాట్లాడుతున్న ప్రజాసంఘాల నాయకులు

కోటపల్లి, మార్చి 11: జోడువాగుల దగ్దర బ్రిడ్జి నిర్మాణంతో పాటు రోడ్డు నిర్మించాలనే డిమాండ్‌తో మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రకు అన్ని ప్రజా సంఘాల నాయకులు తరలిరావాలని సీఐటీయూ, ఇతర సంఘాల నాయకులు కావిరి రవి, రాతిపల్లి నగేష్‌ కోరారు. మండల కేంద్రంలో సోమవారం ప్రజా సంఘాల నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని భీమారం జోడువాగుల దగ్గర ఇరుకైన బ్రిడ్జి , గుంతలమయమైన రోడ్డు ఉండడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని చెప్పారు. దీనిపై సీపీఎం చెన్నూరు, భీమారం, కోటపల్లి కమిటీల ఆధ్వర్యంలో జోడు వాగుల దగ్గర నుంచి భీమారం తహసీల్దార్‌ కార్యాలయం వరకు మంగళవారం పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సీఐటీయూ, కేవీపీఎస్‌, డీవైఎఫ్‌ఐ, పీఏవీఎస్‌, ఏఐకేఎస్‌, ఐద్వా, మత్స్యకార్మిక సంఘాలు మద్దతు తెలిపాయన్నారు. సమావేశంలో నాయకులు డూర్కె మోహన్‌, సమ్మక్క, బూదక్క, రాజేశ్వరి, నాగజ్యోతి, అనిల్‌, మహేష్‌, చంద్రన్న, శ్రీనివాస్‌, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

చెన్నూరు: భీమారం జోడు వాగుల వద్ద నుంచి భీమారం తహసీల్దార్‌ కార్యాలయం వరకు మంగళవారం నిర్వహించే పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. సోమవారం చెన్నూరులో నాయకులు మాట్లాడుతూ జోడు వాగుల వద్ద బ్రిడ్జి ఇరుకుగా ఉండడంతో పాటు రోడ్డు గుంతల మయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు,బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మోహన్‌, నగేష్‌, సమ్మక్క, భూదక్క, రాజేశ్వరి, జ్యోతి, ఉమారాణి, అనిల్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 09:53 PM