Share News

వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న కలెక్టర్‌

ABN , Publish Date - Jan 21 , 2024 | 11:11 PM

మండల పరిధిలోని పెద్దదిన్నె గ్రామంలోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కొనసా గుతున్నాయి.

 వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న కలెక్టర్‌
కలెక్టర్‌ సంతోష్‌కు స్వాగతం పలుకుతున్న ఆలయ అర్చకులు

ఇటిక్యాల, జనవరి 21: మండల పరిధిలోని పెద్దదిన్నె గ్రామంలోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కొనసా గుతున్నాయి. ఆదివారం కలెక్ట ర్‌ బీఎం సంతోష్‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు పురోహితులు పూర్ణకుంభంతో కలెక్టర్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్టతలను గురించి అర్చకులు జయసింహా వివరించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ నరేందర్‌, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2024 | 11:11 PM