Manchiryāla- కంట్రోల్ రూమ్ పరిశీలించిన కలెక్టర్
ABN , Publish Date - May 12 , 2024 | 10:58 PM
నస్పూర్‌లోని జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన సమీకృత కంట్రోల్ రూమ్‌ను ఆదివారం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు.

మంచిర్యాల కలెక్టరేట్, మే 12 : నస్పూర్‌లోని జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన సమీకృత కంట్రోల్ రూమ్‌ను ఆదివారం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్ నేపద్యంలో సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌లో అంతరాయం రాకుండా విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని, నిరంతరం ఇంటర్నెట్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మోతిలాల్, కలెక్టరేట్ పరిపాలన అదికారి పిన్న రాజేశ్వర్, ఎన్నికల తహ సీల్దార్ శ్రీనివాస్, అధికారులు ఉన్నారు.