కోడ్.. గీడ్ జాన్తానై!
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:33 PM
లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి రోజులు గడుస్తున్నా ఘట్‌కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో మాత్రం ఎక్కడ చూసినా గోడలపై ప్రచార రాతలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.

ఎక్కడి గోడరాతలక్కడే
ఎక్కడ చూసినా పోస్టర్లు, ఫ్లెక్సీలే దర్శనం
ఘట్‌కేసర్, ఏప్రిల్ 3: లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి రోజులు గడుస్తున్నా ఘట్‌కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో మాత్రం ఎక్కడ చూసినా గోడలపై ప్రచార రాతలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే పార్టీలకు చెందిన ప్రచార రాతలు(వాల్‌పెయింటిగ్స్) పోస్టర్లను, ప్లెక్సీలను తొలగించాలి. కాని జంట మున్సిపాలిటీల పరిధిలో మాత్రం అదికారులు ఎమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం ఉన్నతాధికారులు పర్యటించే హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారికిరువైపుల ఎక్కడ చూసినా గోడలపై రాతలు, పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఘట్‌కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్ వర్తించదా అని ప్రశ్నిస్తున్నారు.