Share News

సీఎంఆర్‌ను డెలివరీ చేయాలి

ABN , Publish Date - Jul 27 , 2024 | 11:31 PM

లక్ష్యాలకు అనుగుణంగా సీఎంఆర్‌ను నిర్ణీత సమయంలో డెలివరీ చేయాలని అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ మిల్లర్లకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో సీఎంఆర్‌ డెలివరీలో ఆలస్యంపై రైస్‌ మిల్లర్లు, పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.

 సీఎంఆర్‌ను డెలివరీ చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌

వికారాబాద్‌, జూలై 27 : లక్ష్యాలకు అనుగుణంగా సీఎంఆర్‌ను నిర్ణీత సమయంలో డెలివరీ చేయాలని అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ మిల్లర్లకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో సీఎంఆర్‌ డెలివరీలో ఆలస్యంపై రైస్‌ మిల్లర్లు, పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మిల్లు పట్టిన బియ్యాన్ని (సీఎంఆర్‌)ఎ్‌ఫసీఐకి నిర్ణీత సమయంలో చేరవేయడంలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు. 2021- 22 వానాకాలం సీజన్‌ సంబంధించి సీఎంఆర్‌ను ఆగస్టు 15లోపు అందించాలని తెలిపారు. అదే విధంగా 2022-23 వానాకాలం సీజన్‌కి సంబంధించి సెప్టెంబర్‌ మొదటి వారంలోగా సీఎంఆర్‌ను ఇచ్చేలా మిల్లర్లు కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో ఉన్న రైస్‌ మిల్లులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ లక్ష్యాలకు అనుగుణంగా మిల్లింగ్‌ అయ్యేలా డిప్యూటీ తహసీల్దార్లు తమ కార్యాచరణను రూపొందించుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అఽధికారి రాజేశ్వర్‌, జిల్లా మేనేజర్‌ సుగుణ బాయ్‌, రైస్‌ మిల్లర్లఅసోసియేషన్‌ అధ్యక్షులు బాలేశ్వర్‌ గుప్తా, కార్యదర్శి శ్రీధర్‌ రెడ్డి, పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 11:31 PM