Share News

9న కండ్లకోయకు సీఎం రేవంత్‌రెడ్డి రాక

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:45 PM

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ వద్ద ఐటీ హబ్‌ను ఈనెల 9న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

9న కండ్లకోయకు సీఎం రేవంత్‌రెడ్డి రాక
ముఖ్యమంత్రి సభకు స్థల పరిశీలన చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు

ఫ బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

మేడ్చల్‌ టౌన్‌, మార్చి 4: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ వద్ద ఐటీ హబ్‌ను ఈనెల 9న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఐటీ హబ్‌ ప్రాంతాన్ని జడ్పీచైర్‌పర్సన్‌ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వజ్రే్‌షయాదవ్‌లతో కలిసి జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డి బహిరంగ సభాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హరివర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మూడేళ్ల క్రితం అప్పటి ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కండ్లకోయ రింగ్‌రోడ్డు సమీపంలో ఐటీ పార్కు ఏర్పాటు కోసం శంకుస్థాపన చేసి వదిలేశారన్నారు. ఐటీహబ్‌ పనులను తిరిగి తమ ప్రభుత్వం ప్రారంభించనుందన్నారు. ప్రజాహితం పేరిట బీఆర్‌ఎస్‌ వదిలేసిన అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. ఐటీ హబ్‌తో ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి లభించనుందన్నారు. జిల్లాలోని రింగ్‌రోడ్డు సమీపంలో కాలుష్య రహిత పరిశ్రమలను నెలకొల్పటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 9 ఎకరాల్లో నిర్మిస్తున్న ఐటీ హబ్‌లో పలు ఐటీ పరిశ్రమలకు చోటు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ. కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించటం జరుగుతుందని అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు హనుమంత్‌రెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి, రమణారెడ్డి, పోచయ్య గుండ్లపోచంపల్లి కౌన్సిలర్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీ సర్పంచ్‌ బేరి ఈశ్వర్‌, నరేందర్‌, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 10:45 PM