ప్రజలను సీఎం తప్పుదోవ పట్టించారు: నామా
ABN , Publish Date - Feb 12 , 2024 | 02:48 AM
తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రజలను తప్పుదోవ పట్టించారని బీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఎంపీ నామా
ఖమ్మం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రజలను తప్పుదోవ పట్టించారని బీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. పార్లమెంట్‌లో తెలంగాణ ప్రాజెక్టులపై తాను అడిగిన ప్రశ్నలకు వచ్చిన సమాధానాలను వక్రీకరించారని పేర్కొన్నారు. తెలంగాణాను పోరాడి తెచ్చుకున్నది సాగునీళ్ల కోసమేనని, కేసీఆర్ ఎప్పుడూ తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీపడలేదని వ్యాఖ్యానించారు.