Share News

Cybercriminals : లింక్‌ పంపి రూ.3.82 లక్షలు కొట్టేశారు!

ABN , Publish Date - Jun 04 , 2024 | 04:39 AM

తన మొబైల్‌కు వచ్చిన ఓ లింక్‌ను క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేసిన ఓ రైస్‌ మిల్లు యజమాని రూ.3.82 లక్షలు పోగొట్టుకున్నాడు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం విలేజికి చెందిన ఈ రైస్‌ మిల్లు యజమాని

Cybercriminals : లింక్‌ పంపి రూ.3.82 లక్షలు కొట్టేశారు!

బ్యాంకు లోగోతో సైబర్‌ నేరగాళ్ల వల

మోసపోయిన రైస్‌ మిల్లు యజమాని

కేసముద్రంలో ఘటన

కేసముద్రం, జూన్‌ 3 : తన మొబైల్‌కు వచ్చిన ఓ లింక్‌ను క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేసిన ఓ రైస్‌ మిల్లు యజమాని రూ.3.82 లక్షలు పోగొట్టుకున్నాడు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం విలేజికి చెందిన ఈ రైస్‌ మిల్లు యజమాని మొబైల్‌లో వాట్సా్‌పకు ఈ నెల 1న యూనియన్‌ బ్యాంకు లోగోతో లింక్‌ వచ్చింది. అయితే తన బ్యాంకు ఖాతాకు సాంకేతిక సమస్య రావడంతో బ్యాంకు వారే తనకు ఈ లింక్‌ పంపినట్లుగా భావించిన ఆయన ఆ లింక్‌ను క్లిక్‌ చేసి అందులో అడిగిన బ్యాంకు ఖాతా, డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు వివరాలన్నీ నమోదు చేశాడు. ఆ మరుసటి రోజైన ఆదివారం వరుసగా బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసేందుకు 8 సార్లు ఓటీపీ మెసేజ్‌లు వచ్చాయి. ఆ వెంటనే ఖాతా నుంచి నగదు విత్‌డ్రా అయిపోయింది. ఆయన క్రెడిట్‌ కార్డు నుంచి రూ.86,300, డెబిట్‌ కార్డు నుంచి రూ.2.96 లక్షలు వెరసి రూ.3.82 లక్షలను సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. ఈ విషయంపై సైబర్‌ క్రైం విభాగం 1930కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇదే తరహాలో ఇదే జిల్లా మహబూబాబాద్‌ మండలం గడ్డిగూడెంతండాలో ఐదు రోజుల క్రితం ఓ బాధితుడు రూ.1.04 లక్షలు పోగొట్టుకున్నాడు.

Updated Date - Jun 04 , 2024 | 04:39 AM