Share News

పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:52 AM

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. బుధవారం జనగామ మండలం పెంబర్తి, లింగాలఘణపురం మండలం నెల్లుట్లతో

పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు

ఆఖరి గింజ కొనేవరకు ఏ సెంటర్‌ మూసేది లేదు

పౌరసరఫరాలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డీఎస్‌ చౌహాన్‌

జనగామ, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. బుధవారం జనగామ మండలం పెంబర్తి, లింగాలఘణపురం మండలం నెల్లుట్లతో పాటు జనగామ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా... ధాన్యంలో తేమశాతాన్ని పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. పెంబర్తి సెంటర్‌లో ధాన్యం అమ్మిన ఓ రైతుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ‘‘ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చాయా’’ అని అడగ్గా వచ్చాయని చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన చౌహాన్‌... కొనుగోళ్లలో అవకతవకలకు తావు లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల సెంటర్లను తెరిచామని, 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. ఆఖరి గింజను కొనే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏ సెంటర్‌ను మూసివేసేది లేదని స్పష్టం చేశారు. ధాన్యం ఎక్కువగా వచ్చే చోట అవసరమైతే మరో సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల 40 మండలాలు ప్రభావితం అయ్యాయని, కేవలం 138 సెంటర్లలో మాత్రమే ధాన్యం తడిసిందని తెలిపారు. కాగా, మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 24: మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో కాంటా నిర్వహించడం లేదని ఆరోపిస్తూ.. బుధవారం కొందరు రైతులు మెయిన్‌ గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. రెండ్రోజులవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని అధికారులతో వాగ్వావాదానికి దిగారు.

Updated Date - Apr 25 , 2024 | 03:52 AM