Share News

పోలీసుల అదుపులోపౌరహక్కుల సంఘం నేత రాజేశం

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:41 AM

పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కోశాధికారి పోగుల రాజేశంను ఛత్తీ్‌సగఢ్‌ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సంఘం నేతలు,

పోలీసుల అదుపులోపౌరహక్కుల సంఘం నేత రాజేశం

నాటకీయ పరిణామాల మధ్య ఛతీస్‌గఢ్‌కు తరలింపు

జగిత్యాల, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కోశాధికారి పోగుల రాజేశంను ఛత్తీ్‌సగఢ్‌ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సంఘం నేతలు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... జగిత్యాల జిల్లాలోని సారంగపూర్‌ మండలం రేచుపల్లి గ్రామంలోని పోగుల రాజేశం ఇంటికి రెండు నంబరు ప్లేట్లులేని వాహనాల్లో సుమారు ఎనిమది మంది వ్యక్తులు వచ్చారు. దంతేవాడ జిల్లాలోని పోలీ్‌సస్టేషన్‌లో గల ఓ కేసులో విచారణ కోసం తీసుకువెళ్తున్నామని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఎందుకని ప్రశ్నించినప్పటికీ రాజేశంను, ఆయన భార్య మల్లీశ్వరిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. రేచుపల్లి శివారులోకి వెళ్లిన అనంతరం మల్లీశ్వరీని వాహనం నుంచి దింపేసి వెళ్లిపోయారు. గ్రామస్థులు ఈ విషయంపై సారంగపూర్‌ ఎస్‌ఐ తిరుపతికి సమాచారం అందించగా, రాజేశంను తీసుకెళ్లింది దంతేవాడ జిల్లా గీదం పోలీసులేనని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Feb 12 , 2024 | 02:41 AM