Share News

చెర్వుగట్టు జాతర హుండీ ఆదాయం రూ.18.63 లక్షలు

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:16 AM

మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు.

చెర్వుగట్టు జాతర హుండీ ఆదాయం రూ.18.63 లక్షలు

చెర్వుగట్టు జాతర హుండీ ఆదాయం రూ.18.63 లక్షలు

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 29: మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. జాతర సందర్భంగా మొత్తం 16 రోజులకు కలిపి హుండీల ఆదాయాన్ని లెక్కించారు. భక్తులు కానుకుల రూపంలో సమర్పించిన నగదు రూ.18,63,680లు లభించినట్లు ఈవో నవీనకుమార్‌ తెలిపారు. గుట్టపైన ప్రధానాలయం, ఇతర ఉపాలయాల వద్ద ఉన్న హుండీలను తెరిచి లెక్కించగా 14,71,520, గుట్ట కింద పార్వతీ అమ్మవారి ఆలయం వద్ద ఉన్న హుండీలను లె క్కించగా రూ.3,92,160 లభించినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో దేవదాయశాఖ సహాయ కమిషనర్‌ మహేంద్రకుమార్‌, డివిజన పరిశీలకురాలు వెంకటలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:16 AM