Share News

మావోయిస్టు సంజయ్‌ కేసులో చార్జిషీట్‌ దాఖలు

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:57 AM

మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు సంజయ్‌ దీపక్‌ రావు అలియాస్‌ వికాస్‌ అలియాస్‌ ఆనంద్‌ అలియాస్‌ అర్వింద్‌ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ దర్యాప్తులో మరో కీలక పరిణామం

మావోయిస్టు సంజయ్‌  కేసులో చార్జిషీట్‌ దాఖలు

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు సంజయ్‌ దీపక్‌ రావు అలియాస్‌ వికాస్‌ అలియాస్‌ ఆనంద్‌ అలియాస్‌ అర్వింద్‌ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంజయ్‌ దీపక్‌ రావు కేసులో మావోయిస్టుల నియామకాలు, నిధుల సేకరణకు సంబంధించి దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు అధికారులు నాంపల్లిలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో సోమవారం చార్జిషీట్‌ దాఖలు చేశారు. గత సంవత్సరం సెప్టెంబరు 15న సైబరాబాద్‌ పోలీసులు దీపక్‌రావును అరెస్ట్‌ చేశారు.

Updated Date - Mar 12 , 2024 | 03:57 AM