Share News

హైకోర్టు ఏజీపీగా చంద్రశేఖర్‌

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:12 AM

నిడమనూరు మండలం ము ప్పారం గ్రామానికి చెందిన న్యాయవాది గణపురం చంద్రశేఖర్‌కు అరుదైన గౌరవం లభించింది.

 హైకోర్టు ఏజీపీగా చంద్రశేఖర్‌
చంద్రశేఖర్‌

హైకోర్టు ఏజీపీగా చంద్రశేఖర్‌

నిడమనూరు, ఫిబ్రవరి 29: నిడమనూరు మండలం ము ప్పారం గ్రామానికి చెందిన న్యాయవాది గణపురం చంద్రశేఖర్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆయన అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ఫ్లీడర్‌ హైకోర్టు ఆఫ్‌ తెలంగాణ (ఏజీపీ)గా నియమితులయ్యా రు. ఈ మేరకు ఆయన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేసిన ఆ యన హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. హై కోర్టులో న్యాయవాదిగా పని చేస్తూనే ప్రతీరోజు వివిధ సమస్యల తో కోర్టుకు వచ్చే బాధితులకు అవసరమైన న్యాయ సలహాలు అందించేవాడు. ఎంతోమంది పేదలకు కోర్టులో న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తూ తీ న్మార్‌ మల్లన్న టీంలో కూడా లీగల్‌ అడ్వైజర్‌గా సేవలందించాడు. అంతేకాక మల్లన్నపై గత ప్రభుత్వం పెట్టిన కేసులపై కోర్టుల్లో బలంగా వాదనలు వినిపించారు. ఎన్నికల సమయంలో మల్లన్నతో పాటు చంద్రశేఖర్‌ కూడా కాంగ్రె్‌సలో చేరాడు. ప్రభుత్వం ఆయన్ను ఏజీపీగా నియమించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు కోర్టులో న్యాయం జరిగేలా చూస్తానని, తనను ఏజీపీగా నియమించేందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Mar 01 , 2024 | 12:12 AM