Share News

చందంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Jul 21 , 2024 | 12:48 AM

చం దంపేట మండలాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి చే స్తానని ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌ అన్నారు.

 చందంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలునాయక్‌

చందంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌

చందంపేట, జూలై 20: చం దంపేట మండలాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి చే స్తానని ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌ అన్నారు. రై తు రుణమాఫీ సంబురాల్లో భా గంగా మండలకేంద్రంలో శనివారం నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. వరంగల్‌ డిక్లరేషనలో రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటకు కాంగ్రెస్‌ క ట్టుబడి ఉందని, ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే రుణమాఫీ అమలు చేసినట్లు తెలిపారు. రాబోయే రెండేళ్లలో చందంపేట, నేరేడుగొమ్ము మండలాలలోని ఐదు లిప్టులను పూర్తిచేసి మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. ప్రభు త్వం ఏర్పడిన మొదటి నెలలోనే ఉచిత ప్రయాణం, పది లక్షల ఆరోగ్యశ్రీ, రూ. 500 గ్యాస్‌సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత అందించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని అన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన జాల నర్సింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బద్యనాయక్‌, మాజీ ఎంపీపీ పార్వతిచందునాయక్‌, మాజీ జడ్పీటీసీ బుజ్జిలచ్చిరాం, కోఆఫ్షన సభ్యుడు సాధిక్‌, గోసుల అనంతగిరి, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2024 | 12:48 AM