Share News

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలి

ABN , Publish Date - Sep 11 , 2024 | 12:04 AM

: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా మంగళ వారం ఘనంగా నిర్వహించారు.

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలి
నల్లగొండలో ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పిస్తున్న భూపాల్‌రెడ్డి

ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌ వర్క్‌: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా మంగళ వారం ఘనంగా నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని సాగర్‌రోడ్డులో గల ఆమె విగ్రహానికి నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులుఆర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట వీరనారీ చాకలి ఐలమ్మ అని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు కటికం సత్తయ్యగౌడ్‌, మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు కొండూరు సత్యనారాయణ, బోనగరి దేవేందర్‌, మిర్యాల యాదగిరి పాల్గొన్నారు. దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితోనే కేసీఆర్‌ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారన్నారు. సీపీఐ, బీసీ సంక్షేమసంఘం, రజక సంఘాల ఆధ్వర్యంలో ఐలమ్మ వర్థంతి నిర్వహించారు. మర్రిగూడలో జరిగిన కార్యక్రమంలో కొలుకులపల్లి యాదయ్య, మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, పుప్పాల యాదయ్య, ఆదివాసీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. చిట్యాలలో సీపీఎం నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు జిట్ట నగేష్‌, అవిశెట్టి శంకరయ్య, అరూరి శ్రీను, ఐతరాజు నర్సింహ్మ, ఐతారాజు యాదయ్య పాల్గొన్నారు. కేతేపల్లిలో జరిగిన కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు జె. వెంకటనర్సయ్యయాదవ్‌, ఎన్‌.మంగమ్మ, సీహెచ్‌.జానయ్య, ఎస్‌.జేజయ్య, బయ్య ముత్తయ్య, చింత ఆంధ్రయ్య, సీహెచ్‌.లూర్దుమారయ్య పాల్గొన్నారు. నకిరేకల్‌లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందాళ ప్రమీళ, రాచకొండ వెంకట్‌గౌడ్‌, వంటెపాక వెంకటేశ్వర్లు, బొజ్జ చిన్నవెంకులు పాల్గొన్నారు. శాలిగౌరారంలో రజక సంఘం మండల అధ్యక్షులు బాసాని వెంకన్న, తాందారి నాగయ్య, తాందారి సత్తయ్య, తాందారి వెంకటేష్‌, అనుముల వెంకన్న పాల్గొన్నారు. మిర్యాలగూడలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ వర్ధంతిలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్‌ కేతావత్‌ శంకర్‌నాయక్‌ ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఐలమ్మ విగ్రహం వద్ద సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బీ కార్‌ మాల్లేష్‌, మల్లు గౌతంరెడ్డి నివాళులర్పించారు. నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనగల్‌, హాలియా, మునుగోడు మండలాల్లో నారీ ఐలమ్మ వర్థంతి నిర్వహించారు.

Updated Date - Sep 11 , 2024 | 12:04 AM