Share News

ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నిధులు.!

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:19 AM

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకానికి కేంద్రం నుంచి నిధులు అందనున్నాయి.

ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నిధులు.!

పీఎంఏవై కింద వినియోగించే అవకాశం

వచ్చే ఐదేళ్లలో దేశంలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకానికి కేంద్రం నుంచి నిధులు అందనున్నాయి. గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం రూ.80,967కోట్లను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయబోయే ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకానికి పీఎంఏవై కింద నిధులు అందనున్నాయని స్పష్టమవుతోంది. పీఎంఏవై పథకాన్ని అందుకోవాలంటే ముందుగా రాష్ట్రంలో ఎన్ని ఇళ్లను నిర్మించనున్నారు? అర్బన్‌లో ఎన్ని? రూరల్‌లో ఎన్ని? అనే వివరాలను ఓ సమగ్ర నివేదిక రూపంలో కేంద్రానికి అప్పగించాల్సి ఉంటుంది. కేంద్రం ఆ నివేదికను పరిశీలించి, ఎన్ని ఇళ్లకు సాయం చేసేందుకు నిర్ణయించిందో తెలుపుతూ రాష్ట్రానికి లేఖ రాస్తుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తే.. కేంద్రం నిధులను అందజేస్తుంది.

Updated Date - Feb 02 , 2024 | 10:59 AM