Share News

మర్రిగూడలో కారు బీభత్సం

ABN , Publish Date - Mar 21 , 2024 | 12:00 AM

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బట్లపల్లి గ్రామంలో బుధవారం కారు బీభత్సం సృష్టించింది.

మర్రిగూడలో కారు బీభత్సం
అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

మర్రిగూడ, మార్చి 20: నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బట్లపల్లి గ్రామంలో బుధవారం కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన ఆ కారు ఓ ఇంట్లో దూసుకెళ్లింది. ఈ ఘటనలో యువకుడు గాయపడ్డాడు. ఎస్‌ఐ రంగారెడ్డి, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... డ్రైవర్‌ లపంగి కారులో యశ్వంత్‌ మర్రిగూడ నుంచి నాంపల్లికి వెళ్తున్నాడు. బట్లపల్లి గ్రామానికి చేరుకోగానే అదుపుతప్పిన కారు సమీపంలో ఓ ఇంటి వైపు దూసుకెళ్లి ముందున్న షెడ్డును ధ్వంసం చేసింది. ఆ సమయంలో అక్కడ ముగ్గురు యువకులు ఉన్నారు. వారిలో ఒకరికి గాయాలయ్యాయి. కారు అతివేగంగా దూసుకెళ్లడంతో రేకుల షెడ్‌ పూర్తిగా ధ్వంసమైంది. షెడ్డులో ఉన్న రెండు బైకులు కూడా ధ్వంసమైయ్యాయి. కారు తగలడంతో ఇంటి పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభం కూడా ఒరిగింది. కారు డ్రైవర్‌ అతివేగంగా రావడంతో ఈ సంఘటన జరిగిందని ఎస్‌ఐ రంగారెడ్డి, గ్రామస్తులు తెలిపారు. ఇంటి యజమాని మాదగోని వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Mar 21 , 2024 | 12:00 AM