కాల్వల పనులు త్వరగా పూర్తిచేయాలి : చెరుపల్లి
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:02 AM
అసంపూర్తిగా ఉన్న బ్రాహ్మణవెల్లెంల, ధర్మారెడ్డి కాల్వ పనులు త్వరగా పూర్తిచేసి తాగు, సాగునీరు అందిం చాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు.

కట్టంగూరు, ఏప్రిల్ 2: అసంపూర్తిగా ఉన్న బ్రాహ్మణవెల్లెంల, ధర్మారెడ్డి కాల్వ పనులు త్వరగా పూర్తిచేసి తాగు, సాగునీరు అందిం చాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. కట్టంగూరులో మంగళవారం నిర్వహించిన సీపీఎం నకిరేకల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేసే ప్రజా నాయకుడు భువనగిరి పార్లమెంట్ సీపీఎం అభ్యర్థి ఎండీ. జాహంగీర్‌ను గెలిపించాలని కోరారు. అనేక ప్రజా ఉద్య మాలు చేపట్టి ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండి పోరాడారని అన్నారు. డబ్బే ప్రధానంగా ఎంచుకుని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రద్దు చేసే మతోన్మాద బీజేపీకి ఓటు వేయకూడదని కోరారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నాయకురాలు కందాల ప్రమీల, బొజ్జ చిన్నవెంకులు, గంజి మురళి, జిట్ట నగేష్, పెంజర్ల సైదులు, సరోజ, మహేష్, మారయ్య, బక్కయ్య, రమేష్, రామకృష్ణ పాల్గొన్నారు.