Share News

యాదగిరీశుడి హుండీ లెక్కింపు

ABN , Publish Date - Mar 27 , 2024 | 04:51 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి హుండీల కానుకలను మంగళవారం ఆలయ అధికారులు, సిబ్బంది లెక్కించారు. ఆలయ ఖజానాకు 35 రోజుల్లో రూ. 2,85,02,418 ఆదాయం సమకూరింది. భక్తులు

యాదగిరీశుడి హుండీ లెక్కింపు

35 రోజుల్లో రూ 2.85 కోట్ల రాబడి

భువనగిరి అర్బన్‌, మార్చి 26: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి హుండీల కానుకలను మంగళవారం ఆలయ అధికారులు, సిబ్బంది లెక్కించారు. ఆలయ ఖజానాకు 35 రోజుల్లో రూ. 2,85,02,418 ఆదాయం సమకూరింది. భక్తులు స్వామివారి హుండీల్లో సమర్పించిన కానుకలను మంగళవారం కొండకింద సత్యదేవుని వ్రతమండపంలో లెక్కించారు. ఈవో భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి పర్యవేక్షణలో సిబ్బంది వీటిని లెక్కించారు. గత ఫిబ్రవరి 21 నుంచి ఈ నెల 26 వరకు క్షేత్ర సందర్శనకు విచ్చేసిన భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించారు. కాగా, మిశ్రమ బంగారం 0.425 గ్రాములు, మిశ్రమ వెండి 5.960 కిలోలు, విదేశీ కరెన్సీ రూపంలో అమెరికా డాలర్లు 2,697 ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

Updated Date - Mar 27 , 2024 | 09:56 AM