ప్రతీ గ్రామానికి బస్సుసౌకర్యం కల్పించాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 01:18 AM
బస్సుల సంఖ్య పెంచి, ప్రతీ గ్రామానికి బస్సుసౌకర్యం కల్పించాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు.

ప్రతీ గ్రామానికి బస్సుసౌకర్యం కల్పించాలి
జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి
నల్లగొండరూరల్, డిసెంబరు 27 : బస్సుల సంఖ్య పెంచి, ప్రతీ గ్రామానికి బస్సుసౌకర్యం కల్పించాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ బస్టాండ్‌లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళల కు ఉచిత బస్సును కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అ దే విధంగా జిల్లా అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ము ఖ్యంగా మునుగోడు ప్రాంతంలో బస్సు సౌకర్యం లేక సుమారు 500 నుంచి 800 మందికి పైగా విద్యార్థులు చదువుకోవడానికి జి ల్లా కేంద్రానికి రావడానికి అవస్థలు పడుతున్నారని అన్నారు. అనంతరం ఆర్టీసీ డిపో మేనేజర్‌కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలెబోయిన వరలక్ష్మి, రాష్ట్ర క మిటీ సభ్యులు కొండా అనురాధ, జిట్ట సరోజ ఐద్వా జిల్లా సహా య కార్యదర్శి భూతం అరుణకుమారి పాల్గొన్నారు.