Share News

కేసీఆర్‌ దిష్టిబొమ్మల దహనం

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:53 AM

కృష్ణా జలాల మీద నల్గొండలో కేసీఆర్‌ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభను నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ పిలుపు మేరకు సోమవారం వనపర్తి,వరంగల్‌ జిల్లాల్లో మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిష్టబొమ్మలను దహనం చేశారు. కృష్ణా నది జలాలపై మాట్లాడే హక్కు ఆయనకు లేదని వనపర్తిలో అమరచింత మండలం

కేసీఆర్‌ దిష్టిబొమ్మల దహనం

కృష్ణా జలాలపై మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదు

నల్గొండ, వనపర్తి జిల్లాల్లో కిసాన్‌ కాంగ్రెస్‌ సెల్‌ నిరసన

అమరచింత-వరంగల్‌ టౌన్‌, ఫిబ్రవరి 12 : కృష్ణా జలాల మీద నల్గొండలో కేసీఆర్‌ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభను నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ పిలుపు మేరకు సోమవారం వనపర్తి,వరంగల్‌ జిల్లాల్లో మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిష్టబొమ్మలను దహనం చేశారు. కృష్ణా నది జలాలపై మాట్లాడే హక్కు ఆయనకు లేదని వనపర్తిలో అమరచింత మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుపై, వరంగల్‌లో వర్ధన్నపేట అంబేద్కర్‌ సెంటర్‌లో దిష్టిబొమ్మలను దహనం చేశారు. కృష్ణా జలాలపై మంగళవారం నల్గొండలో జరిగే కేసీఆర్‌ సభకు నిరసనగా కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు కేశం నాగరాజు గౌడ్‌, వేముల శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్ల కేసీఆర్‌ పాలనలో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. వేలాది టీఎంసీల నీరు సముద్రంపాలైందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం జలయజ్ఞం కింద చేపట్టిన నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయిల్‌ సాగర్‌, ప్రాజెక్టుల పనులు 90 శాతం పూర్తికాగా, కేసీఆర్‌ ప్రభుత్వం 10 శాతం పనులకు పదేళ్లయినా పూర్తి చేయలేదన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 03:53 AM