ఎల్‌ఆర్‌ఎస్‌తో పెనుభారం
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:12 PM
కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన వెంటనే ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ప్ర జలపై పెనుభారం మోపేందుకు ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపించారు

- మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్
- ఆర్డీవో కార్యాలయం ముందు బీఆర్‌ఎస్ నిరసన
కొల్లాపూర్, మార్చి 6 : కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన వెంటనే ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ప్ర జలపై పెనుభారం మోపేందుకు ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం ముందు ఆ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతీ హామీని తుంగలో తొక్క డం పరిపాటిగా మారిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభు త్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు రె గ్యులరైజేషన్ ఫీజు కట్టేందుకు ముందుకొస్తే ఆనా డు కాంగ్రెస్ పెద్దలు డబ్బులు కట్టవద్దని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీగా రెగ్యులరైజేషన్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీని అమలు పర్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో కోట్ల రూపాయలు విలువ చేసే పీఎంఆర్ వడ్లను, ప్రభుత్వ సంపదను దోచుకుపోయారని మంత్రి స్వగ్రామంలో ఇంత ని ర్వాకం జరిగిన అసలైన దోషులను శిక్షించకుండా కూలీకి వెళ్లిన వారిపై కేసులు నమోదు చేశార న్నా రు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో పి.నాగరాజుకు అం దజేశారు. కార్యక్ర మంలో జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మతిన్‌అహ్మద్, కొల్లాపూర్ ఎంపీపీ రజిత భాస్కర్ గౌడ్, వీపనగండ్ల ఎంపీపీ కమలేశ్వర్‌రావు, బీఆర్ ఎస్ నాయకులు రంగినేని అభిలాష్‌రావు, జి.నరేంద ర్‌రెడ్డి, కాటం జంబులయ్య, రాజేష్, నిరంజన్, సు రేందర్‌రావు, కట్ట శ్రీనివాసులు, పోతుల వెంకటేశ్వ ర్లు, సురేందర్‌గౌడ్, అన్వేష్, డీకే.మాదిగ, ఎంపీటీసీ శంకర్ పాల్గొన్నారు.
కల్వకుర్తిలో ..
కల్వకుర్తి : ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం కల్వకుర్తి పట్టణంలోని తహసీల్దార్ కా ర్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మునిసిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, వెల్దండ మాజీ ఎంపీపీ పుట్టరాంరెడ్డి, పలువురు ని యోజకవర్గంలోని ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజ రయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొ న్నారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసు కోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్‌రాచోటి శ్రీశైలం, విజయ్ గౌడ్, నాయకులు పాండుగౌడ్, నిరంజన్, సూర్యప్ర కాశ్‌రావు, అర్జున్‌రావు, శేఖర్, మల్లేష్, కేశవులు, లిం గం, శ్రీనివాస్‌యాదవ్, ఎంపీటీసీలు రవీందర్‌రెడ్డి, శంకర్, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులున్నారు.
ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి
అచ్చంపేటటౌన్: ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం వైఖ రి మార్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల రాజు అన్నారు. బుధవారం పట్టణంలోని తన నివా సంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ యన మాట్లాడారు. ప్రజలకు హాని చేసే వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. భిన్న ప్రకటనలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తోంద న్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫ్రీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరుపై ఇప్పుడే ప్రజ లు చర్చించుకుంటున్నారని పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చేప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, నాయకులు రాంబాబు, నర్సయ్య, ర మేష్ రావు, శివశంకర్ పాల్గొన్నారు.