ఎల్‌ఆర్‌ఎస్‌తో ప్రజలపై భారం
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:17 PM
కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన వెంటనే ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ప్రజలపై పెనుభారం మోపేం దుకు ప్రయత్నిస్తోందని మాజీ మునిసిపల్ చైర్మన్ కోరమోని నర్సింహులు అ న్నారు.

- ఉచితంగా క్రమబద్ధీకరణ చేయాలి
- ప్రతిపక్షంలో కేసులు వేసి అధికారంలోకి వచ్చాక వసూళ్లా ?
- విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు
మహబూబ్‌నగర్/ జడ్చర్ల/ భూత్పూర్, మార్చి 6 : కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన వెంటనే ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ప్రజలపై పెనుభారం మోపేం దుకు ప్రయత్నిస్తోందని మాజీ మునిసిపల్ చైర్మన్ కోరమోని నర్సింహులు అ న్నారు. ప్రభుత్వమే ఉచితంంగా క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో కౌన్సిలర్ కట్టా రవికిషన్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు ఆహ్వానిస్తే ప్రజలపై భారం మోపవద్దని అప్పటి కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుత కేబినెట్‌లో ఉన్న మంత్రులు కోర్టులకు వెళ్లి నిలుపుదల చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వారు అధికారంలోకి రాగానే ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో వసూళ్లు చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించా రు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పురపాలికల పరిధిలో 1.95 లక్షలమంది, గ్రామపంచాయతీల పరిధిలో 64 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారని, ఇప్పుడు వారందరిపై భారం పడుతుందన్నారు. ఈ సమావేశంలో నాయకులు గంజి ఎంకన్న, రాము, వేదవత్, శ్రీనివాస్‌రెడ్డి, సత్యం, పాత సతీష్ పాల్గొన్నారు.