Share News

పాలకుర్తిలో బీఆర్‌ఎస్‌ ఖాళీ: యశస్వినీరెడ్డి

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:40 AM

పాలకుర్తిలో బీఆర్‌ఎస్‌ పార్టీని ఖాళీ చేస్తామని, కాంగ్రె్‌సలోకి ఊరూరా చేరికలను ప్రోత్సహిస్తామని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి అన్నారు.

పాలకుర్తిలో బీఆర్‌ఎస్‌ ఖాళీ: యశస్వినీరెడ్డి

పాలకుర్తిలో బీఆర్‌ఎస్‌ పార్టీని ఖాళీ చేస్తామని, కాంగ్రె్‌సలోకి ఊరూరా చేరికలను ప్రోత్సహిస్తామని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్యనాయకులు మంగళవారం గాంధీభవన్‌లో యశస్వినీరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా యశస్వినీరెడ్డి మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పార్టీకి లక్ష మెజార్టీ అందించే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.

Updated Date - Apr 03 , 2024 | 02:40 AM