Share News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సను గెలిపించాలి

ABN , Publish Date - May 16 , 2024 | 11:49 PM

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టభద్రుల ఎన్నికల్లో రెం డు సార్లు బీఆర్‌ఎస్‌ పార్టీ అ భ్యర్థి గెలిచారని మళ్లీ ఈ ఉప ఎన్నికలో కూ డా సమర్థవంతంగా పనిచేసే రాకేష్‌రెడ్డికి మొద టి ప్రాధాన్య ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి కోరారు.

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సను గెలిపించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సను గెలిపించాలి

మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

నల్లగొండ, మే 16: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టభద్రుల ఎన్నికల్లో రెం డు సార్లు బీఆర్‌ఎస్‌ పార్టీ అ భ్యర్థి గెలిచారని మళ్లీ ఈ ఉప ఎన్నికలో కూ డా సమర్థవంతంగా పనిచేసే రాకేష్‌రెడ్డికి మొద టి ప్రాధాన్య ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఈ గెలుపుతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారని, అందుకే ఈ ఎన్నికల ను సవాళ్లుగా స్వీకరించాలన్నారు. ప్రతీ పట్టభద్రుని కలిసి ఓ టు అభ్యర్థించాలని కోరారు. సమావేశంలో మునిసిపల్‌ మాజీ చైర్మన మందడి సైదిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్‌, ఉపాధ్యక్షురాలు యాట జయప్రదారెడ్డి, మండల అధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, నాయకులు నారబోయిన భిక్షం, కాంచనపల్లి రవీందర్‌రావు, కొండూరు సత్యనారాయణ, గణేష్‌, శ్రీనివాస్‌, జాఫర్‌, లక్ష్మయ్య, కృష్ణ, శంకర్‌, నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2024 | 11:49 PM