Share News

ఓటుకు నోటు కేసు బదిలీపై నేడు సుప్రీంలో విచారణ

ABN , Publish Date - May 03 , 2024 | 04:44 AM

ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. న్యాయమూర్తులు జస్టిస్‌

ఓటుకు నోటు కేసు బదిలీపై నేడు సుప్రీంలో విచారణ

మధ్యప్రదేశ్‌కు మార్చాలంటూ బీఆర్‌ఎస్‌ పిటిషన్‌

న్యూఢిల్లీ, మే 2 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. న్యాయమూర్తులు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. ఈ కేసు విచారణ తెలంగాణలో కాకుండా మధ్యప్రదేశ్‌ లో జరిగేలా బదిలీ చేయాలని ఈ ఏడాది జనవరి 31న బీఆర్‌ఎస్‌ నేతలు గుంతకండ్ల జగదీశ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, మహ్మద్‌ అలీ, కల్వకుంట్ల సంజయ్‌లు ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై శుక్రవారం మళ్లీ విచారణ జరపనుంది.

Updated Date - May 03 , 2024 | 08:23 AM