Share News

నేడు నల్లగొండలో బీఆర్‌ఎస్‌ సమావేశం

ABN , Publish Date - Apr 01 , 2024 | 05:36 AM

నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం ఉదయం 11గంటలకు జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ

నేడు నల్లగొండలో బీఆర్‌ఎస్‌ సమావేశం

కేటీఆర్‌ రాక.. ముషంపల్లిలో పంటల పరిశీలన

నల్లగొండ, మార్చి 31: నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం ఉదయం 11గంటలకు జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ సమావేశానికి నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌, దేవరకొండ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు పాల్గొనున్నారు. కాగా, సమావేశం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు నల్లగొండ మండలం ముషంపల్లిలో ఎండిన పంట పొలాలను కేటీఆర్‌ పరిశీలించనున్నారు.

Updated Date - Apr 01 , 2024 | 05:36 AM