Share News

జవహర్‌ నగర్‌లో బీఆర్‌ఎస్‌ మేయర్‌ ఔట్‌

ABN , Publish Date - Feb 20 , 2024 | 04:53 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీఆర్‌ఎ్‌సకు మరో షాక్‌ తగిలింది. అధికార కాంగ్రె్‌సలోకి ఇప్పటికే వలసలు జోరందుకున్న తరుణంలో..

జవహర్‌ నగర్‌లో బీఆర్‌ఎస్‌ మేయర్‌ ఔట్‌

మేయర్‌ సహా అంతా బీఆర్‌ఎస్‌ వారే

అయినా నెగ్గిన అవిశ్వాసం

బల నిరూపణలో చెయ్యెత్తిన

20 మంది కార్పొరేటర్లు

కాంగ్రెస్‌కు జైకొడతారా!?

బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతారా..?

జవహర్‌ నగర్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీఆర్‌ఎ్‌సకు మరో షాక్‌ తగిలింది. అధికార కాంగ్రె్‌సలోకి ఇప్పటికే వలసలు జోరందుకున్న తరుణంలో.. ఇప్పుడు మరో సిటింగ్‌ మేయర్‌ స్థానాన్ని అనూహ్యంగా చేజార్చుకోవాల్సి వచ్చింది. మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ మేయర్‌ మేకల కావ్యపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో అసమ్మతి కార్పొరేటర్లు విజయం సాధించారు. ఇప్పుడు కొత్త మేయర్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. దాంతో, వారంతా బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతారా!? కాంగ్రె స్‌లోకి జంప్‌ చేస్తారా!? అన్న దానిపై ఆసక్తి నెలకొంది. జవహర్‌ నగర్‌ కార్పొరేషన్లో మొత్తం 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరంతా బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచినవారే. వీరిలో ఒకరు గతంలో మరణించారు. మిగిలిన 27 మందిలో 20 మంది మేయర్‌పై అవిశ్వాసాన్ని ప్రకటించారు. మునిసిపల్‌ కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు బల నిరూపణ ప్రక్రియ మొదలైంది. దాదాపు 40 రోజులుగా క్యాంపులో కొనసాగుతున్న 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు, ఇటీవల కాంగ్రె్‌సలోకి వెళ్లిన కార్పొరేటర్‌ నీహారిక గౌడ్‌తో కలసి నేరుగా కార్యాలయానికి చేరుకున్నారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది చేతులు ఎత్తి ఆమోదం తెలిపారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లయింది. కాగా, మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకుడు సుధీర్‌రెడ్డి కనుసైగల్లోనే క్యాంపు రాజకీయాలు నడిచాయి. అవిశ్వాసం ప్రవేశపెటిటన కార్పొరేటర్లు.. కాంగ్రె్‌సలో చేరుతురా? లేక బీఆర్‌ఎ్‌సలో కొనసాగుతారా? అన్న దానిపై సస్పెన్స్‌ నెలకొంది. మేయర్‌ ఎన్నిక తేదీ ప్రకటించిన తర్వాత దీనిపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Feb 20 , 2024 | 04:53 AM