Share News

Manchiryāla- బీఆర్‌ఎస్‌ నాయకుల రాస్తారోకో

ABN , Publish Date - Mar 16 , 2024 | 10:48 PM

ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరాస్తాలో బీఆర్‌ఎస్‌ నాయకులు రాస్తారోకో చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీలను రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీయడానికి దుర్వినియోగం చేస్తుందన్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించడానికే ఎన్నికల ముందు కవితను అరెస్టు చేశారన్నారు

Manchiryāla-      బీఆర్‌ఎస్‌ నాయకుల రాస్తారోకో
మంచిర్యాలలో రాస్తారోకో చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

ఏసీసీ, మార్చి 16: ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరాస్తాలో బీఆర్‌ఎస్‌ నాయకులు రాస్తారోకో చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీలను రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీయడానికి దుర్వినియోగం చేస్తుందన్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించడానికే ఎన్నికల ముందు కవితను అరెస్టు చేశారన్నారు. వెంటనే కవితను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు గాదె సత్యం, తాజుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

మందమర్రిటౌన్‌: ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శనివారం బీఆర్‌ఎస్‌ దాని అనుబంధ సంఘాల నాయకులు స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద గల కోల్‌బెల్ట్‌ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించి కవితను అరెస్టు చేయడం దారుణమని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు జె. రవీందర్‌, కొంగల తిరుపతిరెడ్డి, ఎండీ అబ్బాస్‌, మేడిపల్లి సంపత్‌, ఓ. రాజశేఖర్‌, బట్టు రాజ్‌కుమార్‌, బోరిగం వెంకటేష్‌, బండారి సూరిబాబు, మద్ది శంకర్‌, బర్ల సదానందం, పల్లె నర్సింహులు, మేడిపల్లి మల్లేష్‌, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి: బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిందని శనివారం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జాగృతి రాష్ట్ర నాయకుడు సాజన్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని కాంటా చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీలు కుట్ర పూరిత రాజకీయాలు చేస్తూ కవితను అరెస్టు చేయడం సిగ్గు చేటన్నారు. ముందస్తు సమాచారం లేకుండా దేశ ద్రోహిని అరెస్టు చేసినట్లు అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. ప్రధాని మోదీ దేశంలోని స్ర్తీలకు గౌరవం ఇచ్చే ఇదేనా అని ప్రశ్నించారు. కవితను వెంటనే విడుదల చేయకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు సత్యనారాయణ, బానయ్య, వెంకటస్వామి కార్యకర్తలు, జాగృతి నాయకులు పాల్గొన్నారు.

చెన్నూరు: ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ చెన్నూరు పట్టణంలో బీఆర్‌ఎస్‌ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అక్రమంగా కవితను అరెస్టు చేయడం అన్యాయమని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రామకృష్ణాపూర్‌: ఎమ్మెల్సీ కవిత అరెస్టును ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్‌ నాయకుడు డాకర్‌ రాజా రమేశ్‌ అన్నారు. శనివారం రామకృష్ణాపూర్‌లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌కు నిరసనగా బిఆర్‌ఎస్‌ నాయకులు రాస్తారోకో నిర్వహించి, ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పట్టణ ఇన్‌చార్జి గాండ్ల సమ్మయ్య, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, సోషల్‌ మీడియా, మహిళా, యువజన నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 10:48 PM