Share News

ఎంపీ మన్నెను కలిసిన బీఆర్‌ఎస్‌ నాయకులు

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:19 PM

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు మన్నె శ్రీనివాస్‌ రెడ్డికి రెండోసారి టికెట్‌ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం జడ్పీటీసీ సభ్యుడు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ అనంతయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ మాడెమోని నర్సింహలుతో కలిసి హైదరాబాద్‌లో ఎంపీని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

ఎంపీ మన్నెను కలిసిన బీఆర్‌ఎస్‌ నాయకులు
ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో మండల నాయకులు

నవాబ్‌పేట, మార్చి 6 : మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు మన్నె శ్రీనివాస్‌ రెడ్డికి రెండోసారి టికెట్‌ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం జడ్పీటీసీ సభ్యుడు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ అనంతయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ మాడెమోని నర్సింహలుతో కలిసి హైదరాబాద్‌లో ఎంపీని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మచ్చలేని మన్నెకు మరోసారి ఎంపీ టికెట్‌ ఇవ్వడం గెలుపునకు సూచకమన్నారు. ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేసి మరోమారు ఎంపీగా ఆయనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సంతోష్‌రెడ్డి, కోఆప్షన్‌ మెంబర్‌ తాహెర్‌, నాయకులు యాదయ్య, మధుసూదన్‌రెడ్డి, ప్రతాప్‌, కొండాపూర్‌ యాదయ్య, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌, చెన్నయ్య, కృష్ణగౌడ్‌, రఘు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 11:19 PM