Share News

Harish Rao : కాంగ్రెస్‌కు ఓటేస్తే దొంగలకు సద్ది కట్టినట్టే

ABN , Publish Date - May 06 , 2024 | 05:32 AM

ఆరు గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే దొంగలకు సద్ది కట్టినట్టే అవుతుందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీౄశ్‌రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు

Harish Rao : కాంగ్రెస్‌కు ఓటేస్తే దొంగలకు సద్ది కట్టినట్టే

గ్యారంటీల బాండ్లు బౌన్స్‌ అయ్యాయి

దీనికి శిక్షగా ఈ ఎన్నికల్లో ఓడించాలి

ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి: హరీశ్‌

సిరిసిల్ల/భీమదేవరపల్లి/సిద్దిపేట, మే 5 (ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే దొంగలకు సద్ది కట్టినట్టే అవుతుందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీౄశ్‌రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన బాండ్లు ుబౌన్స్‌్‌ అయ్యాయని, ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి మళ్లీ దేవుళ్లపై ఒట్లు వేసుడు మొదలుపెట్టాడని విమర్శించారు. బౌన్స్‌్అయితే చట్టం శిక్షిస్తుందని, ఆ లెక్క ప్రకారం పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి సర్కారును శిక్షించి ఓడించాలన్నారు. ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగిలిన ఐదు పథకాలు తుస్సుమన్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎ్‌సకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. హరీశ్‌రావు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా మల్యాలలో ప్రజాశ్వీరాద సభ, హనుమకొండ జిల్లా ముల్కనూర్‌లో రోడ్‌ షో సందర్భంగా కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు కాంగ్రెస్‌ సర్కారు ఎగనామం పెడుతోందౄన్నారు. ఇప్పటికీ రైతుబంధు డబ్బులు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మే 8 నాటికి రైతు భరోసా మిగిలిన డబ్బులు వేస్తానని రేవంత్‌ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఏడాది డిసెంబరు 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారని, ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారౄన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు 11సార్లు రూ.72 వేల కోట్లు రైతుబంధులో ఇచ్చారన్నారు. రేవంత్‌ రెడ్డి మాటలు ముద్దు ముద్దుగా ఉంటాయని, కానీ ఆయనది మోసం చేసే నైజమని విమర్శించారు. దొంగమాటల కాంగ్రెస్‌, బీజేపీలను నమ్మి మోసపోవద్దని కోరారు. ఐదేళ్లలో బీజేపీ నేత, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఏం చేశారని ప్రశ్నించారు.

రాహుల్‌గాంధీ కాదు.. ‘రాంగ్‌’గాంధీ

తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేశామని, మహిళల ఖాతాల్లో ప్రతి నెలా రూ.2,500 జమ చేస్తున్నామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని హరీశ్‌రావు విమర్శించారు. నిర్మల్‌ సభలో రాహుల్‌ గాంధీ పచ్చి అబద్ధాలు చెప్పి ురాంగ్‌ గాంధీ్‌గా నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు ఆదివారం ఆయన సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరు గ్యారంటీల్లో కేవలం ఒకే ఒక్క గ్యారంటీని పూర్తిగా అమలు చేశారనే విషయం రాహుల్‌కు తెలియదా అని ప్రశ్నించారు. మహిళల ఖాతాల్లో ఏటా రూ.30వేలు జమ చేస్తున్నట్లు సభలో చెప్పి వారి మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు, ముఖ్యమంత్రి, మంత్రులు, నాయకులను మహిళలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీల అమలుపై చర్చకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. లేదంటే బేషరతు క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలన్నారు.

Updated Date - May 06 , 2024 | 05:32 AM