బీఆర్‌ఎస్, బీఎస్పీ పొత్తు వారిష్టం
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:03 AM
బీఆర్‌ఎస్, బీఎస్పీ పొత్తు వారి ఇష్టం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని

మోదీని రేవంత్ పెద్దన్న అంటే కలిసిపోయినట్టేనా?: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి5 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్, బీఎస్పీ పొత్తు వారి ఇష్టం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని రేవంత్‌రెడ్డి పెద్దన్న అని పిలిస్తే.. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటైపోయినట్టేనా? అలా ఎందుకు పిలిచారో ఆయన్నే అడగాలని మీడియాకు సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రెండు డిజిటల్ క్యాంపెయిన్లను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణతోపాటు దేశంలోని అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి మోదీ చేస్తున్న కృషిని వివరించడమే లక్ష్యంగా ‘మన మోదీ’ క్యాంపెయిన్ చేపట్టనున్నామని తెలిపారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలికవసతుల కల్పన, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రె్‌సను 6 గ్యారెంటీల అమలుపై నిలదీస్తూ ‘ప్రశ్నించే తెలంగాణ’ పేరిట క్యాంపెయిన్‌ను చేపట్టనున్నామని కిషన్‌రెడ్డి చెప్పారు.