Share News

బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:35 PM

చించోలి-మహబూబ్‌నగర్‌ జాతీయ రహదారి బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అధికా రులను ఆదేశించారు.

బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలి
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే యెన్నం

- బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

హన్వాడ, సెప్టెంబరు 10 : చించోలి-మహబూబ్‌నగర్‌ జాతీయ రహదారి బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అధికా రులను ఆదేశించారు. మంగళవారం ఇబ్రహీంబాద్‌ వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ని పరిశీలించారు. వారం క్రితం వర్షాలకు తెగిన రోడ్డుకు మరమ్మతులు చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరణ చేసిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. జాతీయ రహదారి అధికారులతో మాట్లాడారు. త్వరితగతిన బ్రిడ్జిలు పూర్తి చేసి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సుధాకర్‌రెడ్డి, మహేందర్‌, వెంకటయ్య, చెన్నయ్య, రహదారి అధికారులు పాల్గొన్నారు.

ఫ మండలంలోని ఇబ్రహీంబాద్‌ గ్రామంలో కాంగ్రెస్‌ నాయకుడు కతల్‌ కృష్ణయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. మంగళవారం ఎమ్మెల్యే శ్రీని వాస్‌రెడ్డి ఆ గ్రామానికి వెళ్లి మృతుని చిత్రపటానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Updated Date - Sep 10 , 2024 | 11:35 PM