Share News

ముగిసిన బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - May 26 , 2024 | 11:57 PM

వెంకటాపూర్‌ శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి.

ముగిసిన బ్రహ్మోత్సవాలు
సాముహిక సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్న ఆలయ కమిటీ చైర్మన్‌ ఉదారి వేణుగోపాల్‌, భక్తులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, మే 26 : వెంకటాపూర్‌ శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, చక్రతీర్థం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం, అనంతరం ఆలయ పూజారి వినయ్‌శర్మ ఆధ్వర్యంలో భక్తులచే సాముహిక సత్యనారాయణ వ్రతం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ ఆలయ బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని, భక్తులు, గ్రామస్తులందరూ సహకరించారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుడు కందుల నవీన్‌, మాజీ సర్పంచ్‌ దేశం బాల్‌రాజ్‌గౌడ్‌, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 11:57 PM