Share News

సరిహద్దులో నిఘా పటిష్ఠం

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:00 AM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దులో నిఘా పటిష్ఠం చేశామని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన తెలిపారు.

 సరిహద్దులో నిఘా పటిష్ఠం
తెలుగు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న నల్లగొండ జిల్లా కలెక్టర్‌ హరిచందన

సరిహద్దులో నిఘా పటిష్ఠం

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు

సీసీ కెమెరాలతో 24 గంటల పర్యవేక్షణ

సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ హరిచందన

దామరచర్ల, మార్చి 28: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దులో నిఘా పటిష్ఠం చేశామని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని రాష్ట్ర సరిహద్దు వాడపల్లి వద్ద గురువారం నిర్వహించిన అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల అధికారుల సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర సరిహద్దులైన నల్లగొండ- పల్నాడు జిల్లాల అంతర్రాష్ట్ర సరిహద్దులో మూడు చెక్‌పోస్టులు, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల సరిహద్దులో ఏడు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 10 చెక్‌పోస్టుల్లో ఏడు శాఖల అధికారులతో నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో రూ.4.5కోట్లు విలువ చేసే నగదు, మద్యం, ఆభరణాలను సీజ్‌ చేశామన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి డబ్బు, మద్యం సరఫరా చేస్తే స్వాధీనం చేసుకుంటామన్నారు. ప్రధానంగా నాగార్జునసాగర్‌ చివరి ఆయకట్టు ప్రాంతంలో నిఘాను పటిష్ఠం చేశామన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో డబ్బు, మద్యం, ఇతరత్రా అక్రమ రవాణా జరగకుండా సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

అన్ని శాఖల సమన్వయంతో నిఘా : సూర్యాపేట కలెక్టర్‌ వెంకటరావు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని ప్రభుత్వశాఖల అధికారులతో సరిహద్దులో నిఘాను పటిష్టం చేశామని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వెంకటరావు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అన్నిశాఖల అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఒక్కో చెక్‌పోస్టులో ఎనిమిది మంది అధికారుల చొప్పున 24 గంటలు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. అక్రమ రవాణాను అరికట్టి ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివ మాట్లాడుతూ ఎన్నికలను సమర్ధంగా నిర్వహించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు పరస్పరం సమాచారాన్ని తెలుసుకునేలా వాట్సా్‌పగ్రూప్‌ ఏర్పాటు చేయడమే కాకుండా అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం వారు సరిహద్దులోని చెక్‌పోస్టుల్లోని రికార్డులను పరిశీలించారు.

అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్పీలు

అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ చందనదీప్తి, సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే హెచ్చరించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల మీదుగా అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌తో కలిసి వారు మాట్లాడారు. సరిహద్దు వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రధానంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో నది గుండా అక్రమ రవాణా అరికట్టేందుకు సరిహద్దు మండలాల అధికారులను సమాయత్తం చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌, నటరాజనతో పాటు ఆదాయపుశాఖ, అటవీ, రెవెన్యూశాఖలతోపాటు పలుశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తే చర్యలు : ఎస్పీ

నల్లగొండ టౌన: సోషల్‌మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తే చర్య లు తప్పవని ఎస్పీ చందనాదీప్తి ఒక ప్రకటనలో హెచ్చరించారు. సో షల్‌ మీడియాలో విద్వేషకర, తప్పుడు పోస్టులు, మార్ఫింగ్‌ చేసి ఫొటో లు, రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, శాంతిభద్రతలకు విఘా తం కలిగించే విధంగా ఉంగే పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసు లు నమోదు చేస్తామని అన్నారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ప్రత్యేక సో షల్‌ మీడియా సెల్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అభ్యంతరకరమై న పోస్టులు తప్పుడు వార్తలు పెట్టే వారిపై ఐటీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయనున్నట్లు ఆమె హెచ్చరించారు.

Updated Date - Mar 29 , 2024 | 12:00 AM