Share News

అన్నిరకాల ధాన్యానికి బోనస్‌ ఇవ్వాలి

ABN , Publish Date - May 16 , 2024 | 11:04 PM

రైతులను కాంగ్రెస్‌ వంచిస్తోందని, రైతు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేయదన్న విషయం స్పష్టమైందని బీఆర్‌ఎస్‌ నాయకులు మండిపడ్డారు.

అన్నిరకాల ధాన్యానికి బోనస్‌ ఇవ్వాలి
మహబూబ్‌నగర్‌ పట్టణం తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

- సన్నాలకే ఇస్తామనడం సరికాదు

- తెలంగాణ చౌరస్తాలో జరిగిన ధర్నాలో బీఆర్‌ఎస్‌ నాయకులు

మహబూబ్‌నగర్‌, మే 16 : రైతులను కాంగ్రెస్‌ వంచిస్తోందని, రైతు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేయదన్న విషయం స్పష్టమైందని బీఆర్‌ఎస్‌ నాయకులు మండిపడ్డారు. వరి సన్నాలకే బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని నిరసిస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు రాజేశ్వ ర్‌గౌడ్‌, గోపాల్‌యాదవ్‌, కొండ లక్ష్మయ్య మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌ అధికారులతో జరిపిన సమీక్షలో సన్నరకాల ధాన్యానికి బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు ధాన్యంపై రూ.500 బోనస్‌ అని చెప్పి ఇప్పుడు సన్నాలకే అనడం రైతు లను మోసం చేయడమేనని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం తన నిర్ణ యాన్ని ఉపసంహరించుకొని అన్ని రకాల వరిధాన్యంపై బోనస్‌ ప్రకటిం చాలని డిమాండ్‌ చేశారు. ముందునుంచి కాంగ్రెస్‌ రైతువ్యతిరేకంగా పాలన సాగిస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు అధికారం చేపట్టి ఆరునెలలైనా అమలుచేయలేదని, ఇప్పుడు ఆగస్టు 15 అని చెప్పడం సరికాదన్నారు. రైతుభరోసా కింద ఎన్నికల్లో చెప్పిన విధంగా ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయ కుండా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని విమర్శిం చారు. కరెంట్‌ సమస్యలతో ఇప్పటికే జిల్లాలో పెద్దఎత్తున పంట ఎండిపోయిందని, పండిన కొద్దిపం టకు కూడా కొనలేక కల్లాల్లోనే మగ్గుతున్నాయని, ధాన్యానికి గిట్టుబాటు కూడా లేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నదని, పండిన ప్రతిగింజను కల్లాల్లోనే గిట్టుబాటు ధర చెల్లిం చి కొనుగోలు చేసిందని నాయకులు గుర్తు చేశారు. రైతు వ్యతిరేక విధా నాలు తీసుకుంటే బీఆర్‌ఎస్‌ రైతుల పక్షాన పెద్దఎత్తున పోరాటం చేస్తుం దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంజి ఎంకన్న కోర మోని నర్సింహులు, కోరమోని వెంకటయ్య, శివరాజు, దేవేందర్‌రెడ్డి, కరు ణాకర్‌ గౌడ్‌, నరేందర్‌, గణేష్‌, గిరిధర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, రాఘవేందర్‌గౌడ్‌, అహ్మదుద్దీన్‌, జంబులయ్య, నవకాంత్‌, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2024 | 11:04 PM